బయోడైవర్సిటీ తరహాలో మరో ప్లైఓవర్‌పై కారు ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

బయోడైవర్సిటీ తరహాలో మరో ప్లైఓవర్‌పై కారు ప్రమాదం

February 18, 2020

fbhg

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు ప్రమాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. తరుచూ యాక్సిడెంట్లు జరిగినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అతి వేగంగా వాహనాలపై దూసుకెళ్తుండటంతో వారితో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదాలను తెచ్చిపెడుతున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన కారు ప్రమాదం మర్చిపోక ముందే మరో ఘటన భరత్ నగర్  బ్రిడ్జిపై జరిగింది

ఓ కారు భరత్‌నగర్ బ్రిడ్జిపై బీభత్సం సృష్టించింది. కూకట్‌పల్లి నుండి సనత్‌నగర్ వైపు వస్తున్న ఓ కారు అదుపు తప్పి బ్రిడ్జి పై నుండి కింద పడిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 2:45 గం.లకు జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా..మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు బోరబండ పండిట్ నెహ్రూ నగర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. కారు వంతెనపై నుంచి కిందపడిపోయిన సమయంలో దాని కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మృతుడు సోహైల్‌గా గుర్తించారు.