కొత్త కారులో మంటలు.. లక్ష నగదు బూడిద  - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త కారులో మంటలు.. లక్ష నగదు బూడిద 

February 21, 2020

ఆదిలాబాద్‌ జిల్లా నేరెడుగొండ మండలం మామడ టోల్‌ గేట్‌ వద్ద శుక్రవారం కొత్తగా కొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. అనుకోకుండా కారులో మంటలు చెలరేగడంతో.. అందులో ప్రయాణిస్తున్నవారు అప్రమత్తమై కారులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. అయితే కారుతో పాటు అందులో ఉన్న లక్ష రూపాయలు కూడా కాలి బూడిద అయ్యాయి. కారు ప్రమాదానికి ఇంజిన్‌లో సాంకేతిక లోపమే అని తెలిసింది. కాగా, ఈ ప్రమాదంలో ఆస్తినష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది