ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోతే వారిదే బాధ్యత.. సుప్రీంకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోతే వారిదే బాధ్యత.. సుప్రీంకోర్టు

April 23, 2022

కార్లలో ఉండే ఎయిర్ బ్యాగ్స్ ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తుల ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు దాదాపు అన్ని కార్లలోనూ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూర్చున్న వ్యక్తి ముందుకు బలంగా వెళ్లకుండా ఇవి ఆపుతాయి. ఇదిలా ఉండగా, ఎయిర్ బ్యాగ్స్ విషయంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎయిర్ బ్యాగులు తెరచుకోకపోతే జరిగే నష్టాన్ని కార్ల కంపెనీలే భరించాలని తీర్పునిచ్చింది. 2015లో ఓ వ్యక్తి హ్యుందాయ్ క్రెటా కారును కొన్నాడు. 2017లో కారుకు యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్స్ పనిచేయకపోవడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆ వ్యక్తి తిక్కరేగి కోర్టులో పిటిషన్ వేశాడు. కేసును విచారించిన సుప్రీంకోర్టు బాధితుడికి రూ. 3 లక్షల నష్టపరిహారాన్నివ్వాలని కంపెనీని ఆదేశించింది. అంతేకాక, డ్యామేజ్ అయిన వాహనం స్థానంలో కొత్త వాహనాన్ని ఇవ్వాలని తీర్పిచ్చింది.