గుంటూరులో కాలువలో పడిన కారు.. ధర్మపురిలో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో కాలువలో పడిన కారు.. ధర్మపురిలో విషాదం

October 16, 2020

bngcn

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంజగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం నింపింది. రొంపిచర్ల వద్ద కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ధర్మపురికి చెందిన వారే ఉన్నారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అర్ధరాత్రి అతివేగంగా వెళ్లడంతో మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. 

ధర్మపురికి చెందిన కటకం మహేష్, రాయపట్నంకు చెందిన ఆనంద్, బీరు గౌడ్, అతని కుమారుడు శివ బాలాజీ కలిసి ప్రకాశం జిల్లాకు చెందిన మేస్త్రీ మాధవ్ స్వగ్రామానికి బయలుదేరారు. గత 15 ఏళ్లుగా ధర్మపురిలో ఉంటున్న బీరు గౌడ్ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మేస్త్రి మాధవ్‌కు వీరంతా మంచి మిత్రులు కావడంతో అతని సొంత ఇంటికి కలర్ వేసేందుకు ధర్మపురిలోకలర్ మిక్సింగ్ చేసి తీసుకెళ్తుండగా ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పొయారు. డ్రైవింగ్ చేస్తున్న మాధవ్ వెంటనే బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు మృతదేహాలు వెలికితీసి స్వగ్రామాలకు తరలిస్తున్నారు.