పెట్రోలింగ్ వాహనాన్నే గుద్దాడు.. పోలీసు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోలింగ్ వాహనాన్నే గుద్దాడు.. పోలీసు మృతి

August 10, 2020

Car Hit Police Patrolling Vehicle in Delhi  .

తాగిన మైకంలో కారును నడుపుతూ ఓ యువకుడు పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించగా.. మరో వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. దేశ రాజధాని ఢిల్లీలోని  ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్లవారుజూమున 2 గంటల సమయంలో ఇది జరిగింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తుషార్ (19)ను అరెస్టు చేశారు. 

మోడల్‌ సిటీ ప్రాంతానికి చెందిన తుషార్‌ రాత్రి సమయంలో స్నేహితులను కలిసి తిరిగి ఇంటికి బయలుదేరాడు. వేగంగా కారును నడుపుతూ వచ్చి ప్రకార్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ప్రమాద దాటికి పెట్రోలింగ్ వాహనం 10 అడుగుల మేర గాలిలో ఎగిరి కిందపడింది. అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వైజర్ సింగ్ తీవ్ర గాయాలతో మరణించాడు. డ్రైవర్ అమిత్ గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన నిందితుడు తుషార్‌పై ఐపిసి 279, 337,304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నే ఢీ కొట్టడం కలకలం రేపింది. కాగా, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం వీధుల్లో నేరాలను అరికట్టడం కోసం రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేశారు. దీనికోసం ప్రకార్ పెట్రోలింగ్ వాహనాలతో నిఘా ఏర్పాటు చేశారు.  \