షిప్‌యార్డ్‌లో అల్లుడు మృతి.. రోడ్డు ప్రమాదంలో అత్తింటివారు..  - MicTv.in - Telugu News
mictv telugu

షిప్‌యార్డ్‌లో అల్లుడు మృతి.. రోడ్డు ప్రమాదంలో అత్తింటివారు.. 

August 2, 2020

Car in Srikakulam.

విశాఖలో షిప్‌యార్డ్‌‌లో శనివారం జరిగిన ప్రమాదంలో మరణించిన భాస్కర్ రావును చూసేందుకు వెళ్తుండగా అత్తింటి వారికి ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా ఉన్న లారీని ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. విషాదంలో ఉన్న ఆ కుటుంబంపై మృత్యువు ఇలా పగబట్టడం అందరిని కలిచివేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు ప్రాంతానికి చెందిన నాగమణి(48) తన అల్లుడి మరణం గురించి తెలిసి విశాఖకు బయలుదేరింది. ఆమె వెంట ఇద్దరు కొడుకులు రాజశేఖర్‌, ఈశ్వరరావుతో పాటు కోడళ్లు పెతిలి, లావణ్య స్కార్పియో కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగమణి, లావణ్య, డ్రైవర్‌ రౌతు ద్వారక(23) చనిపోయారు. క్షతగాత్రులను సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.