హైదరాబాద్‌లో దారుణం..యువతిపైకి దూసుకెళ్లిన కారు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో దారుణం..యువతిపైకి దూసుకెళ్లిన కారు

February 17, 2020

SR Nagar.

హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో సోమవారం ఘోరం జరిగింది. రోడ్డు దాటుతున్న యువతిని ఓ కారు వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో అలేఖ్య అనే యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికులు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదం చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

 అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండగా ఆమెను ఓ బైక్ ఢీకొట్టింది. వెంటనే ఇద్దరూ కిందపడిపోయారు. బైక్ వెనకాలే వస్తున్న కారు బ్రేక్ వేయడం ఆలస్యం కావడంతో ఆమెపైకి దూసుకెళ్లింది. కిందపడిపోయిన ఆమెను కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. కారు చక్రాలు ఆమె శరీరంపై నుంచి వెళ్లాయి. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడింది. వెంటనే  కారు కింద చిక్కుకున్నఅలేఖ్యను బయటకు తీసి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.