విషాదం మిగిల్చిన కారు ప్రమాదాలు..రెండు చోట్ల ఆరుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విషాదం మిగిల్చిన కారు ప్రమాదాలు..రెండు చోట్ల ఆరుగురు మృతి

February 27, 2020

Nalgonda

తెలంగాణలో రహదారులు రక్తసిక్తంగా మారిపోయాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం నల్గొండలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. కరీంనగర్ జిల్లాల్లో ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. అతి వేగంగా కారణంగానే ఈ రెండు ప్రమాదాలు జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. 

వడ్డెరిగూడెంకు చెందిన ఓ కుటుంబం వివాహానికి హాజరై  కారులో తిరిగి వస్తుండగా దుగ్యాలలోని కాల్వలోకి దూసుకెళ్లింది. అందులో నీరు ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వచ్చి కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోవడంతో బలవంతంగా వాటిని పగలగొట్టారు. అంతలోపే కారులో ఉన్న రంగయ్య, అలివేలు, కీర్తి చనిపోగా ఓ బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా ఓకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇటు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద కూడా ఓ కారు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మరణించారు. నలుగురిలో ముగ్గురు మరణించగా.. ఓ వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రణయ్ కుమార్, వివేక్, స్వరాజ్, శివ అంతా కలిసి  హైదరాబాదులో పార్టీ చేసుకోవడం కోసం మంచిర్యాల బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఈ యువకులు కారును అతి వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు ఢీ కొట్టడంతో ఇది చోటు చేసుకుంది.