నీటిలో పడిపోయిన కారులోంచి చిన్నారిని విసిరేసిన వ్యక్తి - MicTv.in - Telugu News
mictv telugu

నీటిలో పడిపోయిన కారులోంచి చిన్నారిని విసిరేసిన వ్యక్తి

October 29, 2019

Car Loses Balance into Water in Madhya Pradesh

బ్రిడ్జి వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ దాన్ని అదుపుచేయలేపోవడంతో కారు కాలువలో పడిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా, ఓర్చాలో చోటు చేసుకుంది. కాలువ పెద్దగా లోతు లేకపోవడంతో అందులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

నీటిలో పడిన వెంటనే అందులో ఉన్న ఓ చిన్న బాబును కాపాడేందుకు బయటకు తీసి అతన్ని బ్రిడ్జిపై నిలబడిన వారి చేతుల్లోకి విసిరేసే ప్రయత్నం చేశారు. అయితే అతన్ని స్థానికులు క్యాచ్ పట్టుకోలేకపోవడంతో తిరిగి నీటిలో పడిపోయాడు వెంటనే స్థానికులు నీటిలోకి దిగి రక్షించారు. మిగితా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారందరిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు ప్రయాణికులు కారులో ఉన్నారు.