ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలల్లో ఖర్చు పెడుతుంటారు. కొందరికి కొన్ని నంబర్లు సెంటిమెంట్ గా ఉంటాయి. వాటినే వారి వాహనాలకు కావాలనుకుంటారు. దానికోసం ఖర్చు చేస్తారు. కానీ ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రూ.27కోట్లు ఖర్చు చేశారు.
సెలెబ్రిటీలకు, రాజకీయ నాయకులకు.. ఎక్కువగా ఈ ఫ్యాన్సీ నంబర్స్ మీద మక్కువ ఉంటుంది. అందుకే వీటిని క్యాష్ చేసుకోవడానికి చూస్తుంటారు. ఒక నంబర్ కోసం చాలామంది వేచి చూస్తుంటే ఆ నంబర్ వేలం వేస్తుంటారు. అలా వేలల్లో ఆ నంబర్లకు ధర పలుకుతుంది.
ఆదివారం హాంకాంగ్ లో ఒక వేలం జరిగింది. వేలం అంటే ఏదో వస్తువులను వేయలేదు. ఒక కస్టమ్ లైసెన్స్ ప్లేట్ ను అమ్మకానికి పెట్టారు. అదేనండీ.. వాహన లైసెన్స్ కోసం అన్నమాట. దీనికోసం ఏకంగా 25.5మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే.. సుమారు 27కోట్ల రూపాయాలన్నమాట. ఇప్పటిదాకా ఇంత మొత్తంలో అమ్ముడుపోయిన రెండవ నంబర్ గా ఇది ప్రసిద్ధికెక్కింది.
బ్లూమ్ బెర్గ్ ప్రకారం.. హాంకాంగ్ రవాణా శాఖ నిర్వహించిన నూతన సంవత్సరం వేలంలో ‘ఆర్’ లైసెన్స్ ప్లేట్ కోసం ఈ ఆఫర్ ఉంచబడింది. రవాణా కార్యదర్శి లామ్ సాయి హంగ్ ఇచ్చిన ర్యాకింగ్ ల ప్రకారం.. 2021లో ‘డబ్ల్యూ’ 26మిలియన్ల కంటే తక్కువగా వచ్చింది. 2006 నుంచి వ్యక్తిగతీకరించి కార్ ప్లేట్ సిస్టమ్ అక్కడ తీసుకురాబడింది. అప్పటి నుంచి 40వేల కంటే ఎక్కువ ప్లేట్ల నమోదు అయ్యాయి. దీనిద్వారా సుమారు 6వేల మిలియన్ డాలర్లను అక్కడి ప్రభుత్వం అందుకున్నది. ఒక నిర్దిష్ట లైసెన్స్ ప్లేట్ కోసం 18నెలల ముందు దరఖాస్తు చేయాలి. దానికోసం ముందుగా 5వేల హాంకాంగ్ డాలర్లను సమర్పించాలి. ఇతర బిడ్ లు ఏవీ క్లెయిమ్ చేయడానికి రాకపోతే ఆ ప్లేట్ మీకే అందుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్స్ వివరాలు..
‘MM’ – రూ. 188 కోట్లు
‘F1’ – రూ. 154కోట్లు
‘New York’ – రూ.154కోట్లు
‘D5’- రూ. 74కోట్లు
‘AA8’ – రూ. 72కోట్లు
‘1’ – రూ. 73కోట్లు
’09’ – రూ.51కోట్లు
‘7’- రూ. 30 కోట్లు
భారతదేశంలో..
చండీగఢ్ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ అథారిటీ నిర్వహించిన వేలంలో 378 కాస్ట్లీ రిజిస్ట్రేషన్ నంబర్లు రూ.1.5కోట్లకు విక్రయించబడ్డాయి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని బ్రిజ్ మోహన్ “CH01-CJ-0001” నంబర్ కోసం రూ.15.44లక్షలు చెల్లించారు. ఇది రూ.5లక్షల ప్రారంభ బిడ్ ను కలిగి ఉంది. మిస్టర్ బ్రిజ్ మోహన్ 2022 దీపావళి సీజన్ లో కొనుగోలు చేసిన తన కొత్త వాహనానికి ఈ లైసెన్స్ ప్లేట్ ను కొనుగోలు చేశారు.