కారు విలువ లక్ష.. చలానాలు రూ.96,830 - MicTv.in - Telugu News
mictv telugu

కారు విలువ లక్ష.. చలానాలు రూ.96,830

May 14, 2019

ఈమ్యధ్య కొందరు చలానాలు ఎప్పటికప్పుడు కట్టక కుప్పలు తెప్పలు చేసుకుంటున్నారు. తప్పించుకుంటున్నాంలే అనుకుంటారు గానీ ఏదో ఒక రోజు పాపం పండినట్టు చలానాలు పండే రోజు కూడా వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు చాలా పకడ్బందీగా తనిఖీలు చేసి ఇలాంటి వాహనాల భరతం పడుతున్నారు. చలానాలన్నీ ఒకేసారి కట్టాలంటే కారు కొన్నంత ఖరీదు అయిపోతుంది. తప్పదు మరి కట్టకపోతే కారు సీజ్ చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ వద్ద ఓవర్ స్పీడుతో వెళ్తున్న ఓ కారును పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆన్‌లైన్‌లో దాని చలానాల చరిత్రను వెలికితీశారు.

Car owner caught with 78 challans in Hyderabad, pays up Rs 96,830.

చచ్చింది చేప అన్నంత కంగారు పడ్డాడు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి. ఆ కారు మీద మొత్తం 78 చలానాలు పెండింగ్‌లో ఉండడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. 78 చలానాలకు గాను రూ.96,830 చెల్లించాలన్నారు ట్రాఫిక్ పోలీసులు. కట్టకపోతే కారును సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక ఆ మొత్తాన్ని చెల్లించాకే కారును విడిచిపెట్టారు. అయితే ఈ ఘటనలో విచిత్రమేమిటంటే ఆ కారు విలువ అటుఇటుగా రూ. లక్షేనట.