మసీదులోకి దూసుకెళ్లిన కారు..సౌదీలో ఘటన - MicTv.in - Telugu News
mictv telugu

మసీదులోకి దూసుకెళ్లిన కారు..సౌదీలో ఘటన

October 31, 2020

courtyard

సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదులోకి ఓ కారు దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ప్రమాదవశాత్తు మసీదు పరిసరాల్లోకి ప్రవేశించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.25 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 

కారు వేగంగా దూసుకొచ్చి మసీదు బయటి ప్రాంగణంలోని ప్లాస్టిక్ బారికేడ్లను దాటుకుంటూ వెళ్లింది. చివరకు మసీదు గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ కారు నడిపిన వ్యక్తిని సౌదీ అరేబియా పౌరుడిగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.