car racing in hyderabad
mictv telugu

హైదరాబాద్ కార్ రేసింగ్‌లో తప్పిన పెను ప్రమాదం

November 20, 2022

హైదరాబాద్‌లో ఉత్సాహంగా ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) సాగుతోంది. భారత్‌లోనే తొలిసారి హైదరాబాద్ హుస్సేన్‌ సాగర్‌ తీరంలో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫియర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు విజయవంతంగా ముగియగా రెండవ రోజు కూడా కారులు 250 కి.మీ.ల వేగంతో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. టీవీలో తప్ప ప్రత్యక్షంగా చూడని కార్ రేసింగ్‌ను నగర వాసులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న రేసింగ్‌కు ఉదయం ఎనిమిది నుంచే సందర్శుకుల తాకిడి మొదలు అయింది.. ఈ రేస్ కారు ధరలు రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పైనే ఉంటాయని చెబుతారు

రేసింగ్ లీగ్ తొలి రోజు పోటీలో కేవలం ప్రాక్టీస్ మాత్రమే జరిగింది. ఈ క్రమంలోనే రేసింగ్‌‌లో ఓ కారుకు పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌లో దూసుకొస్తున్న ఓ కారుపై చెట్టు కొమ్మ విరిగిపడింది.దీంతో కారు ఒక్కసారిగా అదుపుతుతప్పింది.డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి తన కారును ట్రాక్ పక్కన నిలిపేశాడు. ఈ ప్రమాదంలో కారుకు కాస్త డ్యామేజ్ మాత్రమే అయ్యినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.