కొండపోచమ్మ సాగర్ కాల్వలో కారు బోల్తా - MicTv.in - Telugu News
mictv telugu

కొండపోచమ్మ సాగర్ కాల్వలో కారు బోల్తా

May 20, 2020

car

ఈత వస్తే ఎలాంటి జలాశయం లో పడిన ప్రాణాలతో బయటపడవచ్చు. ఇటీవల కొండపోచమ్మ సాగర్ కాలువలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ వ్యక్తి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపునకు కారులో వెళ్తున్నాడు. 

కారు రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కొండపోచమ్మ సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన సదరు వ్యక్తి కారు కీటికి తెరిచి అందులో నుంచి బయటపడ్డారు. ఈదుకుంటూ ఒడ్డును చేరుకున్నారు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సాయంతో కారును నీటిలో నుంచి బయటకు తీశారు.