ముగ్గురి ప్రాణాలు కాపాడిన ప్రమాదం! - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురి ప్రాణాలు కాపాడిన ప్రమాదం!

October 25, 2019

విధి ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ వీడియోను చూస్తే ఆశ్చర్యపోతారు. అదృష్టం కొద్ది ప్రమాదం రూపంలో తరుముకుంటూ వస్తున్న చావు నుంచి  మూడు నిండు ప్రాణాలు వెంట్రుకవాసిలో బయటపడ్డాయి. వీరిని కాపాడేందుకే వచ్చినట్టుగా ఓ కారు.. వేగంగా దూసుకువస్తున్న మరో కారును ఢీకొని నిండు ప్రాణాలను కాపాడింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన అరిజోనాలోని ఫీనిక్స్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Chevy Cruz protects pedestrians in crosswalk

A hero in the form of a Chevy Cruze may have saved the lives of a couple pushing a stroller through a Phoenix crosswalk.The people were trying to cross Indian School at 53rd Avenue late in the evening when a car came barreling through the red light.A Chevrolet Cruz on 53rd Avenue entered the intersection on a green light when a Jeep driven by Ernesto Otanez Oveso slammed into that car, just a few feet away from the pedestrians.Oveso and a woman in the car with him took off running after the accident. Oveso noticed a witness was following him and told that man to stop, even stabbing one of the doors on his car.The 28-year-old was arrested on DUI and aggravated assault charges. Police also found a gun in the Jeep so an additional prohibited possession charge was added.The woman with Oveso at the time of the crash was not located.The driver of that Chevy Cruz was a 27-year-old woman. While she did suffer injuries, they were not life-threatening. Oct 14, 2019.10:10pm 53rd Ave & Indian School.

Posted by City of Phoenix Police Department on Wednesday, 23 October 2019

రాత్రి సమయంలో ఇండియన్ స్కూల్ ఇండర్‌సెక్షన్ వద్ద ఓ జంట తమ పసిబిడ్డతో కలిసి రోడ్డును దాటుతున్నారు. ఆ సమయంలో సిగ్నల్ పడటంతో కార్లన్ని ఆగిపోయాయి. కానీ ఓ కారు వేగంగా వారవైపే దూసుకువచ్చింది. అదే సమయంలో మరో వైపు నుంచి వచ్చిన కారు వారి పైకి దూసుకువెళ్లే సమయంలో ఢీ కొట్టి దాన్ని గమన దిశను మార్చింది. దీంతో చావుదాక వచ్చిన వారు కొద్దిపాటిలో తప్పించుకున్నారు. 

ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ కుటుంబం అక్కడి నుంచి పరుగు పరుగున రోడ్డు దాటింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. అయితే వేగంగా దూసుకువచ్చిన కారుకు తన కారును ఓ మహిళ అడ్డుపెట్టినట్టు పోలీసులు వెళ్లడించారు. సిగ్నల్ పడినా కూడా వేగంగా దూసుకువచ్చిన మరో కారులో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఇది చూసిన వారంతా ఆ కుటుంబానికి అదృష్టం ఉంది కాబట్టే విధి ఇలా కారు రూపంలో వారి చావును ఆపగలిగిందని అంటున్నారు.