కారులో కక్కుర్తి పడ్డారు.. ఊచలు లెక్కిస్తున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

కారులో కక్కుర్తి పడ్డారు.. ఊచలు లెక్కిస్తున్నారు..

April 5, 2018

కామాతురాణాం న భయం న లజ్జ అని సామెత. కామంతో కళ్లుమూసుకుపోతే సిగ్గూశరం వదిలేస్తారని అర్థం. ఇలాంటి బరితెగించిన కామానికి మద్యం కూడా తోడైతే చెప్పాల్సిన పనిలేదు.  గుర్గావ్‌లో అచ్చం ఇలాంటిదే జరిగింది. 20 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి నడిరోడ్డుపై పీకల్దాకా మందుకొట్టి కారులో శృంగారంలో పాల్గొన్నారు. పక్కనే ఉన్న ఇంట్లోంచి ఒక యువతి బయటికి రావడంతో గుట్టురట్టయింది.బుధవారం ఉదయం సెక్టార్ 15, పార్ట్ 2 ప్రాంతంలోని ఓ ఇంటివద్ద ఆగి వున్న కారులోంచి పెద్దపెట్టున అభ్యంతరక శబ్దాలు వచ్చాయి. ఆ ఇంట్లోంచి బయటికి వచ్చిన మహిళ అనుమానంతో కారు తలుపు తట్టింది. దీంతో లోపల ఉన్న జంటకు మండిపోయింది. ఆ యువతిపై బూతులకు లంకించుకున్నారు. సదరు యువకుడైతే ఇంకా కామోన్మాదంలో ఆమె వోణీని లాగేశాడు. బాధితురాలు అరచి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జంటకు తలంటారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి కక్కుర్తిని జంటను కటకటాల వెనక్కినెట్టారు. కారులోంచి పలు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. లైంగిక వేధింపులు, బహిరంగ ప్రదేశంలో సెక్స్ తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. సదరు కామాతురుడిని నజఫ్ గఢ్ కు చెందిన హర్ష్ గా గుర్తించారు. అతనితో కలసి శృంగారంలో పాల్గొన్న మహిళ బెయిల్‌పై బయటికొచ్చింది. ఆమె ఇల్లు కూడా కారును ఆపిన స్థలానికి పక్కనే ఉందట.