ప్రభుత్వానికి పాఠం నేర్పుతున్న కార్టూన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వానికి పాఠం నేర్పుతున్న కార్టూన్ !

June 15, 2017


ఈ కార్టూన్ను చూడగానే కిసుక్కున నవ్వొస్తుంది గానీ దాని వెనకాల చాలా మతలబు వుంది. హరితహారం అనే పథకం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆ కోటి రూపాయల్లో పావు వంతైనా ఫాయిదా జరిగిందా అని ప్రశ్నించుకోమంటోంది ? పెట్టిన మొక్కలను ఎవరు పర్యవేక్షిస్తున్నారని వాకబు చెయ్యమని సవాలేస్తున్నది ?

సర్కార్ ప్రజా సంక్షేమానికి సంబంధించి వినూత్న కార్యక్రమాలు కాదు కార్యాచరణ ముఖ్యమని చెబుతోంది ? కోట్ల రూపాయలు ఖర్చు చేసామని కాలర్లు ఎగరేసి రికార్డులు ఫిల్ చేసుకోవడం కాదు అవి ప్రజల వరకు సక్రమంగానే చేరుతున్నాయా లేదా అని వెరిఫై చెయ్యమంటోంది ? పథకం అనగానే అధికారులందరికీ పండగలా అయిపోయిందని ఇందులోని మేక, ఆవులు చెప్తున్నాయి ? ఓట్లేసి సర్కారును గద్దెనెక్కించిన ప్రజలే హరితహారంలో ఎండిన మొక్కల్లా తయారౌతున్నారని క్వశ్చనేస్తున్నది ? ఒక్క కార్టూను కిసకిస వెనుక ప్రభుత్వాల ఆచరణను సూటిగా ప్రశ్నించింది సుభానీ కార్టూన్…