కార్టున్ చానళ్లే కదా అని వదిలేస్తే..కొంపలంటుకుంటాయ్..బీ కేర్ ఫుల్ - MicTv.in - Telugu News
mictv telugu

కార్టున్ చానళ్లే కదా అని వదిలేస్తే..కొంపలంటుకుంటాయ్..బీ కేర్ ఫుల్

June 3, 2017

స్కూల్ అయిపోయిదంటే చాలు..ఇంటికొచ్చాక పిల్లలు టీవీలకు అతక్కుపోతారు. సమ్మర్ అయితే 24 అవర్స్ అదే పని.. చేతిలో స్మార్ట్ ఫోన్ లేదంటే టీవీ…వాటినే చూస్తూ గడిపేస్తారు. అల్లరి పిల్లలు టీవీ చూస్తుంటే కాసేపైనా కామ్ గా ఉంటారని పేరెంట్స్ వదిలేస్తుంటారు. కానీ అలా వదిలేయడం చాలా డేంజర్..పిల్లలు ఏ కార్టూన్ చానళ్లు చూస్తున్నారు. వాటిలో ఏం వస్తున్నాయి. ఆ ప్రభావం పిల్లలపై ఎంతో ఉంటుందో ఓ సారి ఆలోచించాలి. లేదంటే కొంపలంటుకుంటాయ్..
ఇంట్లో ఇడియట్ బాక్స్..హాలీడేస్ వచ్చాయంటే బుద్దిమంతులైన చిన్నారులూ ఇడియట్సే.సమ్మరైతే ఇంకా టుమాచ్.వీళ్లను పట్టడం ఎవరి వల్ల కాదు.ఎందుకు చేస్తారో..ఏం చేస్తారో వాళ్లకే తెలియదు..తుంటరి పనులతో ఇల్లుపీకి పందిరేస్తుంటారు. గోలగోలతో పిచ్చేక్కిస్తుంటారు.కొందరు పిల్లలు ఇలా ఆటల్లో మునిగితే మరికొందరు ఇడియట్ బాక్స్..అదే …టీవీలకు కనెక్ట్ అవుతారు. లేచి ఉన్నంతసేపు కార్టూన్ నెట్ వర్క్ చానళ్లతో కుస్తీ పడుతుంటారు. లేచి బ్రేష్ చేసే దగ్గరి నుంచి రాత్రి తిని పడుకునే దాకా అదే పనిగా టీవీల్లో లీనమైపోతుంటారు.తల్లిదండ్రులు,అవ్వ,తాతలు కూడా అల్లరి భరించేదానికన్నా టీవీ చూడటమే బెటర్ అనుకుంటారు..కానీ మరి ప్రమాదమని తెలుసుకోలేకపోతున్నారు. ఏదో అరగంట అయితే ఓకే..గంటలు గంటలైతే కష్టమే. ఆరోగ్యంపై ప్రభావం పడటంతో పాటు చిన్నారుల మనస్సుల్ని టీవీలు అల్లకల్లోల పరుస్తున్నాయి.

సాహస కార్యక్రమాలైతే వీరిని విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొందరు తుంటరోళ్లు..వీటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే హైదరాబాద్ బాలాపూర్ లో ఓ పిల్లోడు ప్రాణాలు తీసుకున్నాడు. అంతసేపు టీవీ చూసోచ్చిన జయదీప్ అనే బాలుడు ఆ షో ను అనుకరిస్తూ ఇంటిమిద్దె ఎక్కాడు. ఆ తర్వాత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.కార్టూన్ బొమ్మలా మండుతున్నాను అంటూ తాత దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు.వెంటనే వాళ్లు మంటల్ని ఆర్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు.కానీ ప్రాణాలు దక్కలేదు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన జయదీప్ ను టీవీ షో పొట్టనబెట్టుకుంది.

టీఆర్పీ రేటింగ్ కోసం అలాంటి షోలు చేసే చానల్సే ఇలాంటి ఘటనలకు కారణం.ముమ్మాటికీ వాళ్లదే తప్పు..అలాంటి షోలు పిల్లలపై ప్రభావం చూపుతాయన్న ఇంగిత సోయి ఉండాలి. ఆ ప్రోగ్రామ్ ప్లే అవుతున్నసేపు చిన్న చిన్న అక్షరాలతో హెచ్చరికలు వేయడం కాదు… డేంజర్ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగిలిగి ఉండాలి. లేదంటే ఆ షోలు చూడొద్దని ముందే హెచ్చరించాలి. తల్లిదండ్రులనూ అలర్ట్ అయ్యేలా చేయాలి. ఇదంతా చేయకుండా మీ చావు మీరు చావండి అనే రీతిలో ప్రస్తుత కార్టూన్ చానల్స్ వ్యవరిస్తున్నాయి. ప్లే చేసే వారికి లేకపోయినా కనీసం తల్లిదండ్రులకైనా సోయి ఉండాలి. పిల్లలు ఏ కార్యక్రమాలు చూస్తున్నారు అవి మంచివో కావో కన్నేయాలి. అస్సలు ఎక్కువ సేపు టీవీ చూడటం మాన్పించాలి. హాలీడేస్ లో టీవీలకు అతక్కుపోకుండా ఆటల్లో మునిగేపోయేలా వారిని ప్రోత్సాహించాలి. అప్పుడే దిక్కుమాలిన చానళ్ల ప్రభావం పిల్లలపై ఉండదు. సో బీ కేర్ ఫుల్ పేరెంట్స్…
Tags TV/DangerProgrammes/Childrens