చెల్లిల్ని రేప్ చేసినోణ్ని జైలుకెళ్లి చంపేసిన అన్న - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లిల్ని రేప్ చేసినోణ్ని జైలుకెళ్లి చంపేసిన అన్న

June 30, 2020

case accused stabbed to incident in Tihar Jail

తన చెల్లెల్ని అత్యచారం చేసినవాడు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా ఆ చెల్లి అన్నకు అతని మీద కోపం తగ్గలేదు. ఆ శిక్ష వాడికి సరిపోదని భావించి జైలులో అతన్ని చంపేశాడు.  ఢిల్లీలోని తీహార్ జైల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో జైలులో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీకి చెందిన జాకీర్ చెల్లెలిని అదే ప్రాంతానికి చెందిన మెహతాబ్ అనే వ్యక్తి రేప్ చేశాడు. దీంతో ఆమె ఆ అవమానాన్ని భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. చెల్లెలు అర్థాంతరంగా చనిపోవడంతో జాకీర్ కన్నీరు మున్నీరు అయ్యాడు. తన చెల్లెలిని దారుణంగా రేప్ చేసి, ఆమె మరణానికి కారణమైన మెహతాబ్‌పై పగ పెంచుకున్నాడు జాకీర్. ఈ కేసులో మెహతాబ్‌కు కోర్టు శిక్ష విధించింది. తీహార్ జైలలో శిక్ష అనుభవిస్తున్నాడు మెహతాబ్‌. అయితే ఆ దుర్మార్గుడికి ఆ శిక్ష సరిపోదని భావించాడు జాకీర్. ఎలాగైనా అతన్ని అంతం చేస్తేనే తన చెల్లెలి ఆత్మకు శాంతి చేకూరుతుందని అనుకున్నాడు.

జాకీర్ కూడా అదే జైలులో వేరే నేరంలో శిక్ష అనుభవిస్తున్నాడు. తాను ఉంటున్న వార్డు,  రేపిస్టు మెహతాబ్ ఉన్న వార్డు వేరు కావడంతో జాకీర్ ఉపాయం చేశాడు. తన వార్డులో ఉంటున్న తోటి ఖైదీలతో కావాలని గొడవ పెట్టుకుని దాడి చేశాడు. దీంతో జైలు వార్డెన్ అతని వార్డు మార్చి రేపిస్టు మెహతాబ్ వార్డులో వేశారు. ఏదో ఒకరోజు అతన్ని మట్టుబెట్టాలని ఓ లోహపు ముక్కతో కత్తిలా పదునుగా ఆయుధాన్ని తయారు చేసుకున్నాడు. అదును చూసి ఓరోజు మెహతాబ్‌ని దారుణంగా పొడిచి చంపేశాడు.