భీమ్లా నాయక్ ఫ్యాన్స్‌పై కేసు.. ఏం చేశారంటే? - MicTv.in - Telugu News
mictv telugu

భీమ్లా నాయక్ ఫ్యాన్స్‌పై కేసు.. ఏం చేశారంటే?

March 7, 2022

pavan

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే ఇటు సినిమా నిర్మాతల్లో అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు పండగే. సినిమా విడుదల రోజున పవన్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు, ప్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొంతమంది సినిమా హిట్ట్ అవ్వాలని గుడికి వెళ్లి 101 టెంకాలు, ప్రదర్శనలు చేస్తారు. మరికొంతమంది సినిమా హాల్స్ ముందు డప్పులు, బ్యాండ్‌ వాయిస్తూ, డ్యాన్సులు చేస్తారు. అయితే ఈసారి భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ అభిమానులు భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఓ మేకను బలి ఇవ్వడం సంచలనంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”కొంతమంది పవర్ స్టార్ అభిమానులు సినిమా విడుదల సందర్భంగా మేకను బలి ఇచ్చారు. జంతువులను, పక్షులను బలి ఇవ్వడం నేరం. అందుకు సంబంధించి ఏపీలోని బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం”

అంతేకాదు, ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A),పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు. దీనికి సంబంధించిన వివరాలను అషర్ అనే న్యాయవాది సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మేకను బలిస్తున్న ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.