దర్శకుడు రాంగోపాల్ వర్మ‌పై కేసు.. - MicTv.in - Telugu News
mictv telugu

దర్శకుడు రాంగోపాల్ వర్మ‌పై కేసు..

April 17, 2019

సెన్సేషనల్ డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మపై హైదారాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం వర్మ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో కొందరు వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 13వ తేదీన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో వైసీపీలో చేరినట్లు, కండువా కప్పుకుంటున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలను ట్విట్టర్, ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాంగోపాల్ వర్మ క్షమాపణలు చెప్పాలని లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.