గణేశ్ ఆచార్యపై కేసు.. శృంగారంలో పాల్గొనాలని.. - MicTv.in - Telugu News
mictv telugu

గణేశ్ ఆచార్యపై కేసు.. శృంగారంలో పాల్గొనాలని..

April 1, 2022

dfghfd

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ’ అనే పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన బాలీవుడ్ మాస్టర్ గణేశ్ ఆచార్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆయన వద్ద కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తనను గణేశ్ ఆచార్య శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడని, మానసికంగా పదేపదే వేధించాడంటూ పోలీసులకు 2020లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ మహిళ కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ.. ”నాకు గణేశ్ ఆచార్య వద్దు వద్దు అంటున్నా పోర్న్ వీడియోలను చూపించేవాడు. ఇష్టంలేదని చెప్పినా ఎంతో వేధించేవాడు. తనతోటి శృంగరం చేయడానికి ఒప్పుకోకపోతే, నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. అయినా అతడు ఎంత వేధించిన నేను ఒప్పుకోకపోయేసరికి గణేశ్ మాస్టర్, ఆయన అసిస్టెంట్లు నాపై దాడి చేశారు” అంటూ ఆ మహిళ కొరియోగ్రాఫర్ కన్నీరు మున్నీరు అయింది.

అంతేకాకుండా 6 నెలల కాలంలోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో తన సభ్యత్వాన్ని రద్దు చేయించారని బాధితురాలు తెలిపింది. అందుకే ఆ వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని, నాన్ కాగ్నిసబుల్ కేసును నమోదు చేశానని, తదుపరి చర్యల కోసం లాయర్‌ను కూడా సంప్రదించానని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు.. 354ఏ, 354సీ, 354డీ, 509, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.