గాడిదను వేధించారని ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

గాడిదను వేధించారని ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిపై కేసు

February 18, 2022

gadidhaa

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క విపక్షాలు కూడా నిరసలు తెలిపాయి. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద ఎన్ఎస్‌యూఐష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఆధ్వర్యంలో ‘గాడిదకు కేసిఆర్ చిత్ర పటాన్ని వేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ నాయకులు వెంకట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు శుక్రవారం అర్థరాత్రి హుజురాబాద్ నియోజకవర్గంలో సమావేశాలను ముగించుకొని, తన నివాసానికి తిరిగి వెళ్తుండగా జమ్మికుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది మార్గ మధ్యంలో వెంకట్‌ను అడ్డుకొని అరెస్ట్ చేశారు. గాడిదను వేధించారని టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం హుజురాబాద్ నుండి జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కి వచ్చేందుకు సహకరించాల్సిందిగా కోరారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ.. అర్థరాత్రి సమయంలో ముందస్తు సమాచారం లేకుండా నన్ను అదుపులోకి తీసుకోవడం ఏంటీ. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హేమంత బిస్వ శర్మపై అన్నీ పోలీసు స్టేషన్‌‌లలో క్రిమినల్ కేసులు పెట్టిన, పట్టించుకొని పోలీసులు నాపై ఇచ్చిన కంప్లైంట్‌ని ఎలా స్వీకరించారు. అదుపులోకి ఎట్లా తీసుకుంటారు” అని వెంకట్ ప్రశ్నించారు.