ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా పాల్గొన్న ఓ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. గేదెపై కూర్చోవడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతు చట్టంతోపాటు కరోనా నిబంధనలు ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరికి ఈ చేదు అనుభవం ఎదురైంది. అరెస్ట్ తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేశారు. అయితే తాను గత పాలకుల తీరును ఎండగట్టడానికే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
గయ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పర్వేజ్ మన్సూరి ఇటీవల తన ప్రచార కార్యక్రమంలో గేదెపై కూర్చొని ఇంటింటికి వెళ్లారు. ఈ సందర్భంగా గయలో ఉన్న పరిస్థితులను విరిస్తూ ఓట్లు అడిగారు. గత పాలకులు చెత్త నగరంగా మార్చేశారని విమర్శించారు. గాంధీ మైదానం నుంచి స్వరాజ్పురి రోడ్డుకు చేరగానే అతన్ని అరెస్ట్ చేశారు. జంతువులను ప్రచారం కోసం వినియోగించవద్దని ఈసీ హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో కేసు నమోదు చేశారు. కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. గయా నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.