అల్లు అర్జున్, 'పుష్ప' టీంపై ఫిర్యాదు! - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు అర్జున్, ‘పుష్ప’ టీంపై ఫిర్యాదు!

September 17, 2020

hgt

ఈ నెల 13న నటుడు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాతాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

కుంతల జలపాతం సందర్శనకు అనుమతి లేదని, అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా ‘పుష్ప’ చిత్రబృందం కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడం తోపాటు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపారు.