టీవీ కామెడీ షోలు వివాదాలకు దారితీస్తున్నాయి. జబర్దస్త్ లాంటి షోల్లో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, అప్పారావు తదితర నటులు జోకుల పేరుతో మహిళలను, వికలాంగులను అవమానిస్తూ వెకిలి హాస్యం చేస్తున్నారని ఇప్పటికే విమర్శలున్నాయి. తాజాగా ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్ శ్రీముఖిపై కూడా ఒక వర్గం వారిని కించపరిచిందని కేసు నమోదైంది. జెమిని టీవీ చానల్లో ఒక కార్యక్రమంలో ఆమె బ్రాహ్మణులను అమానించిందని నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు. దీతో పోలీసులు శ్రీముఖితోపాటు, జెమిని టీవీ యాజమాన్యంపై కేసు నమోదు పెట్టారు.