బాలీవుడ్ నటి రవికపై రచ్చ.. కేసు నమోదు  - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ నటి రవికపై రచ్చ.. కేసు నమోదు 

November 22, 2019

Case filed against Bollywood actress vani kapoor 

బాలీవుడ్‌ కథానాయిక, తెలుగు చిత్రం ‘ఆహా కళ్యాణం’ భామ వాణీ కపూర్ అనవసరంగా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇటీవల ధరించిన రవికపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అది తమ మనోభావాలను గాయపరిచిందని ముంబై వాసి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

వాణి ఇటీవల పింక్ రంగు బ్లౌజులో ఫోటో షూట్ చేశారు. రవికపై శ్రీరామ్ అని పలుచోట్ల అచ్చేశారు. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరును ఇలా కించపరచడం సరికాదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ ఫొటోలను తీసేశారు. అయితే అప్పటికే అవి జనంలోకి వెళ్లాయి. ముంబైకి చెందిన రామా సావంత్ ఈ విషయాన్ని ఎన్నెమ్ జోషీ మార్గ్‌లోని ఠాణా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.