అల్లు అర్జున్‌ కొత్త యాడ్.. అంబర్‌పేట్ పీఎస్‌లో కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు అర్జున్‌ కొత్త యాడ్.. అంబర్‌పేట్ పీఎస్‌లో కేసు నమోదు

June 10, 2022

పుష్ప మూవీ భారీ సక్సెస్‌తో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అలియాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌‌కు బ్రాండ్ వ్యాల్యూ దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఇటీవల పలు వ్యాపార ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అనేక బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తున్నారు. కానీ ఆయన చేసిన పలు యాడ్స్‌ వివాదాలకు దారి తీస్తున్నాయి. ఆ మధ్య రాపిడో బైక్ పై చేసిన యాడ్‌లో.. సిటీ బస్సుల గురించి చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ యాడ్ తొలగించకపోతే అల్లు అర్జున్, రాపిడో సంస్థపై కేసు వేస్తామని హెచ్చరించారు. దీంతో రాపిడో ఆ షాట్ తొలిగించింది.

ఆ తర్వాత జోమాటో యాడ్.. ఈ యాడ్‌లో నటుడు సుబ్బరాజును బన్నీ కొట్టగా.. ఆ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. ‘బన్నీ నన్ను త్వరగా కిందకు దించవా..’ అని సుబ్బరాజు అడిగితే.. ‘సౌత్ సినిమా కదా..? ఎక్కువ సేపు ఎగరాలి’ అని బన్నీ అంటాడు. సౌత్ సినిమాలు, అందులో యాక్షన్ సీక్వెన్స్‌లపై అల్లు అర్జున్ కౌంటర్ వేసినట్లుగా ఉండడంతో గతంలో వివాదం నడిచింది.

కొత్తగా చేసిన చైతన్య విద్యా సంస్థల యాడ్ ప్రమోషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ఉపేందర్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో ఆ యాడ్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆయన బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కేసు పెట్టారు. తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.