మిలింద్ సోమన్.. వయసు యాభై ఐదు దాటినా భయంకరమైన ఫిట్నెస్తో హల్చల్ చేస్తుంటాడు. తనకంటే వయసులో పాతికేళ్లు చిన్నదైన యువతిని పెళ్లాడిన మిలింద్ అత్యుత్సాహానికి పోయి చిక్కులో పడ్డాడు. అతడు గోవా బీచ్‌లో నగ్నంగా పరిగెత్తడంపై తీవ్ర దుమారం రేగుతోంది.
‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 55 ఏళ్లు దాటినా పరుగెత్తేస్తున్నా’ అంటూ అతడు ఆ ఫోటోరాజాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోపక్క బాలీవుడ్ నటి పూనమ్ పాండే కూడా అదే బీచ్‌లో ‘అశ్లీల వీడియో’ షూట్లో పాల్గొంది. ముంబై సినిమా, మోడలింగ్ బ్యాచ్ ఇలా పనిగట్టుకుని తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారని, గోవాకు చెడ్డపేరు తెస్తున్నారని గోవన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి. ఉత్తబిత్తల పరిగెత్తింది మిలింద్ సోమనే అని నిర్ధారించుకున్న పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. పూనమ్ పాండేపై అంతకు ముందే కేసు నమోదైంది. ఒకరకంగా చెప్పాలంటే పూనమ్ పాండేపై కేసు కారణంగానే మిలింద్‌పై కేసు నమోదు చేశారు. పూనమ్‌పై కేసు పెట్టిన పోలీసులు అంతకంటే దారుణమైన నగ్నత్వాన్న ప్రదర్శించిన మిలింద్‌ను ఎందుకు వదిలేశారని మహిళా సంఘాలు విమర్శించడంతో పోలీసులు అతనిపైనా కేసు పెట్టారు.