నిర్మాత ఏక్తా కపూర్ పై హైదరాబాద్ లో కేసు! - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మాత ఏక్తా కపూర్ పై హైదరాబాద్ లో కేసు!

May 18, 2020

ekta kapoor

బాలీవుడ్ బడా నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు  విశాల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఏక్తా సారధ్యంలోని బాలాజీ టెలి ఫిలింస్ నిర్మించిన ఓ వెబ్ సిరీస్ లో ఆర్మీ దుస్తులను అసభ్యకర రీతిలో చూపించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఓ ఆర్మీ అధికారి భార్యకు, వేరే వ్యక్తికి ఉన్న సంబంధాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించారని పేర్కొన్నారు. ఏక్తాపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులు స్వీకరించారు. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత ఆమెకు నోటీసులు పంపుతామని తెలిపారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీకి ఏక్తా కపూర్ చేస్తున్న సేవలకు గాను ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కరంతో సత్కరించింది.