కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు  - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు 

October 23, 2019

revanth reddy....

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్‌పై వచ్చిన ఆయన్ను ఆపేసి, అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు. రేవంత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చలో ప్రగతి భవన్ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కల్గించినందుకు రేవంత్‌పై ఐపీసీ సెక్షన్ 351 ,353 ,332 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌తో పాటు ఆయన అనుచరులైన ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు మేరకు రేవంత్ పై కేసు నమోదు చేశారు.