లంచగొండి ఏసీపీ 1.75 కోట్ల వసూళ్లు..సిగరెట్లే టార్గెట్ - MicTv.in - Telugu News
mictv telugu

లంచగొండి ఏసీపీ 1.75 కోట్ల వసూళ్లు..సిగరెట్లే టార్గెట్

May 14, 2020

money

బెంగళూరులో లంచగొండి పోలీస్ అధికారి బాగోతం బట్టబయలైంది. చేతిలో అధికారం ఉంది కదా అని సిగరెట్ వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన లంచగొండి పోలీసుతో సహా అతనికి సహకరించిన మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై కేసు నమోదైంది. దీంతో పోలీసు అధికారులపైనే కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. 

సీసీబీ ఏసీపీ ప్రభుశంకర్, ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, అజయ్‌ సిగరెట్ వ్యాపారుల నుంచి సుమారు రూ.1.75 కోట్ల అక్రమంగా వసూలు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల నుంచి రూ.52 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం డీజీపీ దృష్టికి వెళ్లడంతో వాళ్ళను సస్పెండ్ చేశారు. కేసు నమోదైన అధికారులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసును స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలని యోచిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.