హెలికాఫ్టర్లో పెళ్ళికి వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ టాపిక్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోంది. సదరు వ్యాపారి కుటుంబం ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తమ హెలికాప్టర్ ల్యాండింగ్ చేశారు. అనంతసాగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు.
వివాహానికి హాజరైన తర్వాత తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్కు చేరుకున్నారు. అక్కడ ఉన్న రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు వెంటనే హెలికాప్టర్ ల్యాండింగ్ విషయాన్ని గుర్తించారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండింగ్, టేకప్ చేసినందుకు కేసు నమోదు చేసి విచారణ మొదలెట్టారు. హెలికాప్టర్ సంస్థ అన్ని అనుమతులు తీసుకున్నాకే తమను హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తీసుకొని వచ్చి వెళ్లిందని సదరు వ్యాపారవేత్త తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.