ట్రాక్టర్ నడిపిన నారా లోకేష్‌పై కేసు నమోదు! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాక్టర్ నడిపిన నారా లోకేష్‌పై కేసు నమోదు!

October 27, 2020

 vijay sai reddy

ఆకివీడు పోలీస్ స్టేషన్‌‌లో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై కేసులు నమోదయ్యాయి. సోమవారం రోజున సిద్ధాపురంలో లోకేష్ ట్రాక్టర్ నడిపిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో లోకేష్ కరోనా వైరస్ నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.

దీనిపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. రైతుల్ని పరామర్శించడం, రైతులకి అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ రెడ్డి దృష్టిలో నేరం. ఈ నేరంపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు. అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారని అన్నారని లోకేష్ ట్వీట్ చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తానని తెలిపారు.