నయనతార జంటపై కేసు నమోదు.. కారణం హీరో అజిత్ - MicTv.in - Telugu News
mictv telugu

నయనతార జంటపై కేసు నమోదు.. కారణం హీరో అజిత్

March 23, 2022

ag

లేడీ సూపర్ స్టార్ నయన తార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్‌పై చెన్నైలో కేసు నమోదైంది. వారి నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’ను బ్యాన్ చేయాలంటూ సామాజిక కార్యకర్త కణ్ణన్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని మీడియా సంస్థల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం రౌడీలను అణచివేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న సమయంలో రౌడీలను ప్రోత్సహించేలా వారి చర్యలున్నాయని కణ్ణణ్ ప్రధాన ఆరోపణ. అంతేకాక, నిర్మాణ సంస్థకు పెట్టిన పేరుపై కూడా కణ్ణణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాగా, రౌడీ పిక్చర్స్ నిర్మాణంలో నయనతార హీరోయిన్‌గా ఆమె ప్రియుడి దర్శకత్వంలో సూపర్ స్టార్ అజిత్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. అజిత్‌తో సినిమా ప్రకటించిన సంతోషంలో నిర్మాణ సంస్థ టీమ్ భారీ మొత్తంలో టపాకాయలు కాల్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలని కణ్ణణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.