కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. వర్మపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. వర్మపై కేసు

October 28, 2019

Ram Gopal Varma..

వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిలుస్తూ ఉంటారు. ఆయన సినిమా రాబోతోందంటే కంట్రవర్సీ కచ్చితంగా ఉంటుంది. తాజాగా విడుదలైన  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సినిమా టైటిల్‌పై దుమారం మొదలైంది. దీనిపై అనంతపురం కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడి నేతలు ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేలా సినిమా పేరు, ట్రైలర్ ఉందని వ్యాఖ్యానించారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సినిమా టైటిల్ ఉందని, వారు  ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా టైటిల్ ఉందని చెప్పారు. వెంటనే సినిమా పేరును మార్చాలని డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యాన్ని తీసుకోని సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.