జులాయిగా తిరిగిన ఎమ్మెల్యే.. అరెస్ట్, క్వారంటైన్ - Telugu News - Mic tv
mictv telugu

జులాయిగా తిరిగిన ఎమ్మెల్యే.. అరెస్ట్, క్వారంటైన్

May 5, 2020

Case On MLA Aman Mani Tripathi In Lockdown..

చిన్న చిన్న కారణాలు సాకుగా చూపి బయట తిరగడం సామాన్యులకే కాదు.. కొంత మంది ప్రజా ప్రతినిధులకు కూడా అలవాటైంది. ఇలాగే ఏదో వంక చూపి బయట తిరిగేద్ధామని అనుకున్న ఓ ఎమ్మెల్యేకు పోలీసులు చుక్కలు చూపించారు.లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై కేసు నమోదు చేయడంతో పాటు 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. అతనితో పాటు తన అనుచరులకు కూడా ఇదే పరిస్ధితి పట్టింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది

నవ్‌తన్వా ఎమ్మెల్యే అమన్‌మణి త్రిపాఠి ఆరుగురు అనుచరులతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లారు. అంతర్రాష్ట ప్రయాణం నేపథ్యంలో అతన్ని ఘజియాబాద్ ప్రాంతంలో ఆపి ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు అడిగాడు. కేదర్‌నాథ్, బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్తున్నట్టుగా చెప్పడంతో పర్మిషన్ లెటర్ చూపించాలని కోరారు. అతని వద్ద లేకపోవడంతో.. ప్రజా ప్రతినిధినే ఆపుతారా అంటూ వెంటనే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారందరిని అదుపులోకి తీసుకొని రెండు వాహనాలను సీజ్ చేశారు.  ఐపీసీ సెక్షన్ 188, 269, 270 కింద కేసు

నమోదు చేశారు. కాగా గతంలో అతనిపై భార్యను హత్యచేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.