యుద్ధం పేరుతో దోపిడీ.. తిరుపతిలో షాపులపై కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం పేరుతో దోపిడీ.. తిరుపతిలో షాపులపై కేసులు

March 12, 2022

nune

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి కొందరు దుకాణాదారులు అధిక ధరలకు కిరాణా సరుకులు విక్రయిస్తున్నారు. ఇలా చేసిన దుకాణాదారులపై 16 కేసులు నమోదు చేసినట్టు తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి తెలిపారు. కొందరు వినియోగదారుల ఫిర్యాదుతో తిరుపతి రీజనల్ విజిలెన్స్ అధికారి ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని దుకాణాలపై కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఏర్పేడు, చంద్రగిరి, వి. కోటలలో కొన్ని దుకాణాలు, తిరుపతి రిలయన్స్ మార్టును పరిశీలించారు. ఇందులో 16 దుకాణాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు అతిక్రమించే వ్యాపారుల వివరాలను 0877 – 2242062 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఈశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.