యాక్సిడెంట్ బాధితులను ఆదుకుంటే నగదు బహుమతి : సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

యాక్సిడెంట్ బాధితులను ఆదుకుంటే నగదు బహుమతి : సీఎం

March 22, 2022

h

తనదైన శైలిలో పాలన సాగిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయాన్ని సకాలంలో అందేలా ప్రయత్నించే వారికి ఐదు వేల నగదు బహుమతితో పాటు, ప్రశంసా పత్రాన్నిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతకుముందు ప్రమాదంలో గాయపడిన వారికి 48 గంటల్లోపు ఉచిత చికిత్సనందించే పథకాన్ని స్టాలిన్ గతంలో ప్రారంభించారు. లక్ష రూపాయల బీమానందించే ఈ పథకంలో దాదాపు 1400 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు భాగస్వాములుగా ఉన్నాయి. పథకం లబ్దిదారులకు ప్రమాదం జరిగినప్పటి నుంచి గాయాలు పూర్తిగా నయమయ్యే వరకు పూర్తి చికిత్సను ఉచితంగా అందిస్తాయి. లబ్దిదారులు కానివారు ప్రమాదం నుంచి కోలుకునేంత వరకు మాత్రమే చికిత్సనందిస్తాయి. ఈ సౌకర్యాలు తమిళనాడులో జరిగే ప్రమాదంలో గాయపడిన ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తాయి. కాగా, అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో స్టాలిన్ కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు. ఆరోగ్య హక్కును ప్రాథమిక హక్కుగా భావించి ఇంకా పెద్ద స్థాయిలో పథకాల రూపకల్పనకు ఆయన ప్రయత్నిస్తున్నారు.