వాహనాలపై కులం పేర్లు.. 133 మందికి జరిమానాలు - MicTv.in - Telugu News
mictv telugu

వాహనాలపై కులం పేర్లు.. 133 మందికి జరిమానాలు

October 26, 2019

Cast vehicles penalized.

టూవీటర్లు, ఫోర్ వీలర్లు.. ఏ వాహనమైనా సరే కొందరు తమ కులం పేర్లను ముద్రించుకుని మరీ మురిసిపోతుంటారు. అవి రోడ్లపైన వెళ్తుంటే తమది ఫలానా కులం అని జనం గుర్తించాలని ఆరాటపడిపోతుంటారు. కులాల అడ్డాగా పేరుపడిన ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యవహారం మరీ ఎక్కువ. కులాల పేర్లతో జనం కొట్టుకుచస్తున్న నేపథ్యంలో అక్కడి అధికారులు క్యాస్ట్ బండ్లపై వేటు వేస్తున్నారు. కుల ప్రదర్శన చేస్తున్న వాహనాలకు నోయిడా పోలీసులు జరిమానాలు విధించారు. 

‘పట్టణ ప్రాంతాల్లో 100, గ్రామీణ ప్రాంతాల్లో 33 వాహనాలపై కులాల పేర్లు, కులం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలను గుర్తించాం. వాటి యజమానులకు చలానా విధించాయి. దురుసు వ్యాఖ్యలు, బెదిరింపులు ఉన్న 91 వాహనాలకు కూడా చలానా వేశాం. నంబర్ ప్లేట్ల విషయంలో అవకతవకలకు పాల్పడిన బండ్లకు కూడా జరిమానాలు విధించాం.. ’ అని పోలీసులు చెప్పారు. పోలసులు శుక్రవారం గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో ఆపరేషన్ క్లీన్‌ కింద తనిఖీ చేసి కులం బండ్లను పట్టుకున్నారు.