Caste issue in suryapeta
mictv telugu

సూర్యాపేటలో కులహత్య.. బీరుసీసాలతో ఘోరం

August 8, 2022

మిర్యాలగూడ కులహత్యలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అస్తులు, అంతస్తుల తేడాలకంటే కులమే ప్రేమకు పెద్ద అడ్డంకిగా మారుతోంది. సూర్యాపేట జిల్లాలో తాజాగా కుల హత్య జరిగింది. చెల్లిని ప్రేమించిన యువకుడిని ఆమె సోదరుడు బీరు సీసాలతో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు.

తాళ్లగడ్డకు చెందిన యువతిని దిలీప్ అనే స్థానిక యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. యువతి సోదరుడు దిలీప్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. సరదాగా మాట్లాడుకుందామంటూ సద్దల చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడి కట్టమైసమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్లి వెంట తెచ్చుకున్న బీరు సీసాలతో పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.