Home > Featured > తల్లి ప్రేమ అంటే ఇదే.. బిడ్డను ఆస్పత్రికి తీసుకొచ్చిన పిల్లి

తల్లి ప్రేమ అంటే ఇదే.. బిడ్డను ఆస్పత్రికి తీసుకొచ్చిన పిల్లి

‘అమ్మను మించిన దైవమున్నదా..’ అని సినిమా పాటొకటుంది. తల్లిప్రేమను కళ్లకు కంటే అలాంటి ఉదంతమొకటి తాజాగా చోటు చేసుకుంది. అమ్మప్రేమ మనుషుల్లోనే కాదు, ఏ జీవరాశిలోనైనా ఉంటుందని, బిడ్డల కోసం తల్లి పడే ఆరాటాన్ని మాటల్లో చెప్పలేమని అది రుజువు చేసింది.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ ఆస్పత్రికి పిల్లి తన బిడ్డను పరుగుపరుగనా తీసుకొచ్చింది. అనారోగ్యం పాలైన కూనను నోట కరుచుకొచ్చి.. ‘ప్లీజ్ దీనికేమో అయ్యింది. ఆడుకోవడం లేదు, పాలు తాగడం లేదు. దయచేసి కాపాడండి.. ’ అని మూగభాషలో చెప్పింది. విషయం అర్థం చేసుకున్న వైద్యసిబ్బంది పిల్లికూనను ప్రేమగా చేతుల్లోకి తీసుకుని వైద్యం చేశారు. తర్వాత కూన చలాకీగా తిరిగింది. తల్లికి సంతోషంగా గంతేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుక్కలాగే పిల్లులు కూడా తెలివైన జంతువులు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పసిగడుతుంటాయి.

Updated : 1 May 2020 12:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top