జగన్‌కు షాక్.. కిశోర్ సస్పెన్షన్ చెల్లదన్న క్యాట్  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌కు షాక్.. కిశోర్ సస్పెన్షన్ చెల్లదన్న క్యాట్ 

February 25, 2020

mnnfb

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో చుక్కెదురైంది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆయనకు కేంద్ర సర్వీసులకు అవకాశం కల్పించింది. ఆయనపై తీసుకున్న చర్యలు సరికాదని వ్యాఖ్యానించింది. కృష్ణ కిషోర్ పై ఉన్న కేసును ఏపీ ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని సూచించింది. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణ కిశోర్ ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు ప్రారంభించారు. బాధ్యతల నుంచి తప్పించి సీఐడీ, ఏసీబీలతో విచారణకు ఆదేశించింది.ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడంపై కృష్ణ కిషోర్ క్యాట్ లో పిటిషన్ వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న క్యాట్ ధర్మాసనం తాజా తీర్పును వెల్లడించింది. దీంతో ఆయనకు ఈ కేసు నుంచి ఊరట లభించింది.