చావును జయించిన పిల్లికూన - MicTv.in - Telugu News
mictv telugu

చావును జయించిన పిల్లికూన

September 5, 2017

పసిపిల్లలు బోరుబావుల్లో ప్రమాదవశాత్తూ పడిపోవడం, చాలా కేసుల్లో వారిని కాపాడ్డానికి నానా కష్టాలు పడినా ఫలితం లేకపోవడం మనకు తెలిసిందే. అయితే ఓ పిల్లికూన మాత్రం ఇలాంటి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి చావును ఎగతాళి చేసింది.

హైదరాబాద్ బోయిన్ పల్లిలోని 110 అడుగుల లోతున్న ఓ బోరుబావిలో ఆదివారం రాత్రి ఓ పిల్లిపిల్ల ఆడుకుంటూ పడిపోయింది. 30 అడుగుల వద్ద ఉన్న ఓ చిన్న పైపువద్ద చిక్కుకుని ఆగిపోయింది. సగం నీటిలో తేలుతూ.. సాయం కోసం తలెత్తి చూస్తూ నరకయాతన అనుభవించింది. స్థానికులు దాన్ని బయటకి తీయడానికి విఫలయత్నం చేశారు. వీలుకాకపోవడంతో అనిమల్ వారియర్స్ ఇండియా(ఏడబ్ల్యూఐ) టీమ్ కు సమాచారం ఇచ్చారు. ఆ టీం వచ్చింది. అప్పటికే ఆలస్యమైంది కనుక కూన చనిపోయే అవకాశముందని అనుకున్నారు. అయినా మానవప్రయత్నం చేశారు. జూమ్ కెమరా, తాళ్లు ఇతర సాధనాలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

కెమెరా సాయంతో చూడగా పిల్లిపిల్ల సాయం కోసం తల పైకెతి చూస్తూ కనిపించింది. రెస్క్యూ టీం మొదట వలలాంటి మెష్ ను బావిలోకి పంపింది. కూన దాన్ని కరుచుకుంటే పైకి తీసుకురావచ్చని అనుకున్నారు. అయితే పిల్ల నీరసంగా ఉండడంతో దాన్ని అందుకోలేపోయింది.  తర్వాత అసలు కనిపించకుండా పోయింది. టీం ఆశలు వదిలేసుకుంది. పిల్ల నీటిలో పడిపోయి చనిపోయి ఉంటుందనుకున్నారు. అయితే మళ్లీ కెమెరాతో చూడగా పిల్ల పైపు చాటున కనిపించింది. ఈసారి సపోర్ట్ తాడును బావిలోకి పంపారు. పిల్లికూన మూతివద్దకు దాన్ని తీసుకెళ్లారు. కూనకు ఏదో అర్థమైంది. చటుక్కున ఆ తాడును నోటితో గట్టిగా పట్టుకుంది. రెస్క్యూం టీం గుండెలు అదురుతుండగా మెల్లగా తాడును పైకిలాగారు.. పిల్లికూన పైకొచ్చేసింది.. దానికి తర్వాత పాలు తాగించి పక్కనే ఉన్న తల్లివద్ద వదిలేశారు. తాడును పట్టుకుంటే పైకి వెళ్లొచ్చన్న ఆలోచన ఈ పిల్లికూనకు ఎలా వచ్చిందబ్బా అని జనం తెగ ఆశ్చర్యపోతున్నారు.

Kitten rescued from a 6inch wide borewell

A kitten fell into a borewell of 6 inch wide and around 110 ft deep. She was hanging onto pipe at 30ft depth.Only her was out of water, she kept hanging onto the pipe. After 5 hours of struggle she became very weak and tired. We had very less time to save her. With proper planning a support rope was sent in. Nothing was visible from top. Had to use zoom camera to monitor the situation. After many failed attempts, surprisingly she bit the support rope very firmly. Slowly she was pulled to safety. She was very cold by then, using hair dryer and some warm hugs from the team she recovered from the cold. After a while she became very active and started looking for mother who was watching the whole operation sitting ahead.She was fed with warm milk which she enjoyed pretty much and ran to mother. Every moment was so tensed in this rescue operation. The borewell was sealed properly to avoid future accidentsDisclaimer: This video is exclusively managed by Caters News. To license or use in a commercial player please contact info@catersnews.com or call +44 121 616 1100 / +1 646 380 1615

Posted by Animal Warriors Conservation Society on Monday, 4 September 2017