అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్! - MicTv.in - Telugu News
mictv telugu

అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్!

October 20, 2019

anosmia

ఎంతో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్ ట్రెసా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందట. తనే స్వయంగా ఈ విషయం వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు అనోస్మియా అనే వ్యాధి ఉందని తెలిపింది. ఈ వ్యాధి వున్నవాళ్లు ఎలాంటి వాసనలు ఆఘ్రాణించలేరని చెప్పింది. వారు మంచి వాసనలే కాదు, చెడు వాసనలు కూడా గుర్తించలేరని వాపోయింది. వాసనలు గుర్తించే శక్తి వారిలో శూన్యం అని వివరించింది. ఈ జబ్బు కారణంగా పెళ్లి చేసుకోకూడదని భావిస్తున్నానని, అయితే సినిమాల్లో నటనకు ఈ లోపం అడ్డంకి కాదని పేర్కొంది.

కాగా, కేథరిన్ తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, పైసా వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కొంతకాలంగా ఆమె తమిళ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈమధ్యే ఆమె నటించిన తమిళ సినిమా ‘వదలడు’ విడుదల అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తోంది.