టిక్‌టాక్‌లో కొత్త ఫిల్టర్..జడుసుకుంటున్న పిల్లులు - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌లో కొత్త ఫిల్టర్..జడుసుకుంటున్న పిల్లులు

November 19, 2019

Cats reaction to cat face filters

టిక్‌టాక్ మొబైల్ యాప్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెట్టింట్లో అత్యధిక డౌన్లోడ్లతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ యూజర్లకు మరింత వినోదాన్ని అందించడానికి ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫిల్టర్లను విడుదల చేస్తుంది. 

తాజాగా టిక్‌టాక్‌ క్యాట్‌ఫిల్టర్‌‌ను విడుదల చేసింది. యూజర్లు దీనిని ఉపయోగించి తమ ముఖాన్ని పిల్లివలే మార్చేసుకుంటున్నారు. అలా మారిన తమ ముఖాల్ని పెంపుడు పిల్లులకు వాటి హావభావాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.