Caught on cam: Girl brutally thrashed by gang of girls as onlookers
mictv telugu

‘నీకు నా బాయ్‌ఫ్రెండే దొరికాడా.?’ నడిరోడ్డుపై చితకబాదింది

November 29, 2022

Caught on cam: Girl brutally thrashed by gang of girls as onlookers

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన ప్రియుడిని మరో అమ్మాయితో చూడలేకపోయిందా ప్రియురాలు. అతనే తన జీవితమనుకొన్న ఆమెకు.. మధ్యలో వచ్చిన యువతిపై విపరీతమైన కోపం పెంచుకుంది. తన ప్రియుడిని వలలో వేసుకున్న ఆమెకు ఎలాగోలా బుద్ధి చెప్పాలని సమయం కోసం ఎదురుచూసింది. అనుకోకుండా న‌డి బ‌జార్లో ఎదురుకావడంతో.. అంద‌రి ముందు ఆ యువ‌తి తాట తీసింది. నీకు ఇంకెవడూ దొరకలేదా అంటూ లాగి కొట్టింది. ఆమెకు తోడుగా మ‌రో న‌లుగురు అమ్మాయిలు క‌లిసి ఆ యువ‌తిపై భీకరంగా దాడి చేశారు. చివ‌ర‌కు ఓ యువ‌కుడు ఆమెను అమ్మాయిల దాడి నుంచి కాపాడాడు. బీహార్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అమ్మాయిల ఘర్షణకు సంబంధించిన షాకింగ్ ఘటన బీహార్‌లోని స‌ర‌న్ జిల్లా ప‌రిధిలోని సోనేపూర్ లో జరిగింది. సోనేపూర్‌ మేళా (జాతర) లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. యువకుడు వేరే అమ్మాయితో కలిసి జాతరకు వచ్చాడు. ఈ సమయంలో వారిద్దరినీ చూసిన యువతి.. వారితో గొడవకు దిగింది. యువకుడితో నీకేం సంబంధం అంటూ ఆమెపై దాడి చేసింది. ఆమెకు మద్దతుగా మరో నలుగురు అమ్మాయిలు కూడా.. ఆమెపై చేయి చేసుకున్నారు. అమ్మాయిల దాడిలో బాధితురాలి దుస్తులు సైతం చినిగిపోయాయి.ఈ సమయంలో అక్కడున్న ఓ యువకుడు వారిని సముదాయించి.. బాధితురాలిని కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.