డబ్బు కోసం కొందరు దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. అవసరమైతే ప్రాణాలు కూడా తీసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కావాలనే కారుతో ఢీకొట్టారు కొందరు దుండగులు. కారు బలంగా ఢీకొట్టడంతో అతడు ఎగిరి అంత దూరంలో పడ్డాడు. వెంటనే కారులో నుంచి దిగిన ఇద్దరు యువకులు.. రక్తపు మడుగులో పడిపోయిన అతడికి చెందిన ఆభరణాలు, డబ్బులు లాక్కెళ్లారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. వీడియోను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (NYPD)సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
🚨WANTED for ROBBERY: Do you know these guys? On 7/23/22 at approx. 6:40 AM, opposite 898 E 169 St in the Bronx, the suspects struck a 39-year-old male with a car, then proceeded to forcibly take his property. Any info? DM @NYPDTips, or anonymously call 800-577-TIPS. pic.twitter.com/RngQ1JUA4C
— NYPD NEWS (@NYPDnews) July 24, 2022
ఈ ఘటన శనివారం ఉదయం గం.6:40 ల ప్రాంతంలో చోటు చేసుకున్నదని పేర్కొన్నారు. రోడ్డు దాటుతున్న 39 ఏండ్ల వ్యక్తిని ఓ బ్లాక్ సెడాన్ కారు కావాలనే ఢీకొట్టిందని తెలిపారు. తీవ్ర గాయాలతో అల్లాడుతున్న అతడిని పట్టించుకోకుండా.. కారులో నుంచి దిగిన ఇద్దరు యువకులు, ఆ వ్యక్తి జేబుల్లో ఉన్నవి దోచుకెళ్లారని చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర విభాగం బృందాలు బాధితుడిని హుటాహుటిన లిన్‌కోల్న్ ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు కారు దిగి చోరీకి పాల్పడగా మరో వ్యక్తి కారులో ఉన్నట్లు చెప్పారు.