Caught On Camera: Telangana BJP Chief's Son Sai Bhageeratha’s new video Viral
mictv telugu

‘బండి సంజయ్ కొడుక్కి ఇదే పనా?’.. బయటపడ్డ మరో వీడియో

January 18, 2023

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ వీడియోలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తోటి విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో ఇష్టానుసారంగా బూతులతో తిడుతూ.. చెంపదెబ్బలు కొడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారగా.. తాజాగా మరో వీడియో అతని అహంకారాన్ని, గర్వాన్ని బయటపెడుతున్నాయి.

తాజా వీడియోలో… ఒక క్లాస్ రూమ్‌లో బండి సంజయ్ కొడుకుతో సహా పలువురు విద్యార్థులు తోటి విద్యార్థిని కొట్టడం కనిపించింది. ఈ వీడియోలో బండి సంజయ్ పక్కనే ఉన్న వారిని వెళ్లవద్దని చెబుతూ బాధితుడిపై దాడి చేస్తున్నాడు. ఇలాంటి వరుస వివాదాలు, కేసుల కారణంగా బండి సంజయ్ కుమారుడిని మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియోలో బండి సంజయ్ కొడుకు కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తోటి విద్యార్థి అని కనికరం లేకుండా కాళ్లతో విచక్షణారహితంగా బాధిత విద్యార్థిపై కొట్టడం విద్యార్థుల పట్ల ఇదే నా గౌరవం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంత తప్పుచేస్తే మాత్రం కాళ్లతో కొట్టాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు వీడియోలను చూసిన నెటిజన్లు.. పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? అంటూ బండి సంజయ్ ని ప్రశ్నిస్తున్నారు. మంచి బుద్ధులు నేర్పించకుండా .. ఇలా స్కూళ్లకు, కాలేజీలకు ఏం నేర్చుకోమని పంపిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. భగీరథ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకు బదులు ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.