దారుణం.. టాయిలెట్లలో కబడ్డీ ప్లేయర్లకు భోజనాలు
ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కబడ్డీ ప్లేయర్లకు బాత్రూంలలో భోజనాలు ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే… యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని యూపీలో.. తాజాగా ఓ కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. సహరన్‌పుర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన జరిగిన కబడ్డీ టోర్నమెంట్ లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. అయితే.. వారికి యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.. కానీ.. తినే ఆహారాన్ని మాత్రం టాయిలెట్లలో ఏర్పాటు చేసి.. వారిని అవమానించింది.
इकाना में नया कारनामा सामने आया है, सहारनपुर में 300 कबड्डी खिलाड़ी जिस टूर्नामेंट में आए उन्हें स्पोर्ट्स अथॉरिटी ने बाथरूम में खाना परोसा। @myogiadityanath @myogioffice #UttarPradesh #inhuman
— Pooja Singh (@ipoojasingh) September 20, 2022
టాయిలెట్ గదిలో అన్నం, పప్పు, కూరల పాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో ఉంది. ఒక చోట అయితే పూరీలను నేలపై ఓ పేపర్‌లో వేసి పెట్టారు. లంచ్ సమయంలో.. క్రీడాకారులంతా.. ఆ బాత్రూంల్లోకి వచ్చి.. అక్కడ ఉన్న ఆహారాన్ని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక ఈ వీడియోను చూసిన.. నెటిజన్లు..యోగి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా అంటూ సెటైర్లు పేల్చుతున్నాయి.
అయితే ఈ వ్యవహారంపై సహరన్‌పుర్ క్రీడా అధికారి అనిమేశ్ సక్సేనా స్పందించారు. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను ‘ఛేంజింగ్ రూం’లో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ‘‘వర్షం కారణంగా వంట పాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న ఛేంజింగ్ రూంలో పెట్టాం’’ అని సక్సేనా చెప్పడం గమనార్హం.